33.4 C
India
Sunday, June 7, 2026
More

    Rajamouli Direction Mahesh Babu Movie : #SSMB29 హీరోయిన్ ఎవరంటే..?

    Date:

     

    Rajamouli Direction Mahesh Babu Movie : రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరో రాబోతున్న చిత్రం #SSMB29. ఇందులో హీరోయిన్ ఎవరంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెర్చింగ్ నడుస్తోంది. దర్శకధీరుడు రాజమౌలి సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా రూపుదిద్దుకోబోతోంది. అయితే ఈ మూవీని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ఆర్ఆర్ఆర్ రెండు ఆసార్ అవార్డులు దక్కంచుకున్న తర్వాత రాజమౌళి సినిమాల విషయంలో మరింత కేర్ తీసుకోబోతున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

    ఆస్కార్ అవార్డు వేధికకు వెళ్లిన రాజమౌళిని సినీ జర్నలిస్టులు పలకరించగా మహేశ్ బాబుతో సినిమా తీయాలని ఆ కోరిక ఎప్పటి నుంచో ఉందని చెప్పుకచ్చారు. దీంతో పాటు కథ ఏ విధంగాం ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మహేశ్ బాబు ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఫుల్ మీల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. చూడగానే హాలీవుడ్ లుక్స్ తో కనిపించే మహేశ్ బాబుతో అదే రేంజ్ లో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నానని ప్రకటించారు.

    రాజమౌళి ఆలోచనల మేరకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు సిద్ధం అవుతున్నారు. తారాగణంను కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మహేశ్ బాబు సరసన అలియా భట్ ను తీసుకువచ్చే ఛాన్స్ ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

    #SSMB29లో హీరోయిన్ గా ఆలియాభట్ రావచ్చు అంటూ గాసిప్ లు వస్తున్నాయి. అయితే ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ సరసన నటించారు ఆలియాభట్. అయితే సినిమా లెంత్, ఇంపార్టెన్స్ విషయంలో ఆమె నటించిన చాలా సీన్లను ఎడిట్ చేశారు. దీనిపై ఆమె తీవ్ర నిరాశకు లోనైంది. దీంతో పాటు ఈవెంట్లో కూడా ఆమె వచ్చామా అన్నట్లే కనిపించింది. దీనిపై రాజమౌళి మాట్లాడారు కూడా.

    ఆలియాభట్ తోనేనా..?
    ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఆలియా భట్ సీన్లు ఎడిట్ అయిన మాట వాస్తవమే కానీ, అదేదో కావాలని చేయలేదని ప్రకటించారు. మళ్లీ ఆమెతో  సినమా తీస్తానని కూడా మాట ఇచ్చారు. ఇదే విషయాన్ని ట్విటర్ లో కూడా ప్రకటించారు ఆయన. అయితే ఆలియాభట్ ప్రస్తుతం ఒక శిశువుకు జన్మనిచ్చింది.  ఆమె కోలుకునే వరకు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని సెట్స్ పైకి వెళ్తుంది కాబట్టి ఆమె పాల్గొనే ఛాన్స్ కూడా ఉంది. రాజమౌళి ఇచ్చిన మాట ప్రకారం #SSMB29లో ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటాడా..? అని ఇప్పుడు వైరల్ అవుతుంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విలన్ గా రావచ్చని కూడా లీకులు ఉన్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    SS Rajamouli : రాజమౌళి ప్రాజెక్టులో ఐదుగురు స్టార్ హీరోలు?

    SS Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు రాజమౌళి....

    Pushpa movie : పుష్ప సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. బ్యాడ్ లక్ అంటే ఇదే..!

    Pushpa movie : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక టాపిక్...

    Bhola shankar Director : మహేశ్ బాబు సినిమాలో ‘భోళా శంకర్’ డైరెక్టర్.. ఏ పాత్రలోనంటే?

    Bhola shankar Director : రీసెంట్ గా రిలీజైన రెండు సినిమాల...

    Mahesh Babu Guntur Kaaram : గుంటూరు కారం సంక్రాంతికి విడుదల చేసేందకు ప్లాన్?

    Mahesh Babu Guntur Kaaram :మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్...