Ram Boyapati Combinations : రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణకు బంపర్ హిట్లు ఇచ్చిన బోయపాటి రామ్ ను కూడా అదే రేంజ్ లో నిలబెడతాడని అనుకుంటున్నారు. దీంతో సహజంగానే ఈ సినిమాపై అందరికి ఆతృత నెలకొంది.
రామ్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ వండర్ క్రియేట్ చేసింది. ప్రేక్షకుల అంచనాలు నిజం చేస్తూ భారీ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా కూడా మంచి హిట్ సాధిస్తుందని అందరు నమ్ముతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ కొడుతుందని టాక్.
శ్రీలీల బర్త్ డే సంర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడం గమనార్హం. భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా మైసూర్ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి చిత్రం యూనిట్ కు కృతజ్ణతలు తెలిపారు. మాస్, ఎంటర్ టైన్ మెంట్ కలయికతో చిత్రం ఆకట్టుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ 20న అన్ని భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రీరికార్డింగ్, డబ్బింగ్ తదితర కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఇంకా సమయం పడుతుంది. దీంతో సినిమా విజయంపైనే అందరు ఆశలు పెంచుకున్నారు. రామ్ కు కూడా కొంత కాలంగా సక్సెస్ లు లేవు. ఇస్మార్ట్ శంకర్ తరువాత అతనికి అంత పెద్ద స్థాయిలో హిట్ రాలేదు. ఇదే ఆ లోటును తీరుస్తుందని అనుకుంటున్నారు.






