వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన తర్వాత వైసీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బాబాయ్ ను చంపిందేవరు అంటూ టీడీపీ బలంగా జనాల్లోకి వెళ్తుండగా, సీబీఐ విచారణలో సంచలన నిజాలు బయటపడబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. వీటికి తోడు అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ ఏ క్షణమైనా మళ్లీ జైలుకు వెళ్లొచ్చన్న అభిప్రాయం పెరుగుతోంది.
జగన్ జైలుకు పోతే వైసీపీని లీడ్ చేసేదెవరు…? గతంలో అండగా ఉన్న షర్మిల, విజయమ్మలను జగన్ స్వయంగా దూరం చేసుకున్నాడు. కనీసం వారు ఆయన్ను కలిసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిణామాలు మనం గమనిస్తూనే ఉన్న దశలో, జగన్ సతీమణి వైఎస్ భారతి లీడ్ చేస్తారని వైసీపీలో ఎప్పటి నుండి ప్రచారం ఉంది.
నిజానికి జగన్ సతీమణి భారతి కేవలం సాక్షి వ్యవహరాలే కాకుండా వైసీపీ వ్యవహరాల్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. తాజాగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీగా పంపిస్తున్నారు. నిజానికి వైఎస్ జగన్ స్వస్థలం జమ్మలమడుగే. పైగా అక్కడి నుండే ఇటీవల కడప స్టీల్ ప్లాంట్ కూడా ఓపెన్ చేశారు. ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డికి జగన్ ఎంత చెప్తే అంత.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డిని అక్కడ తట్టుకోవాలంటే ఈసారి సుధీర్ రెడ్డితో కాదని, పైగా భవిష్యత్ లో అరెస్ట్ ల వరకు వెళ్తే సీఎం చైర్ ను మరొకరికి ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుండి వైఎస్ భారతిని రంగంలోకి దింపబోతున్నట్లు వైసీపీ వర్గాలంటున్నాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే భారతిని జమ్మలమడుగు నుండి ఎన్నికల బరిలో ఉంచబోతున్నారని, అందుకే రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీగా సెటిల్ చేశారంటున్నారు.
ఎంతోకాలంగా జైలు భయంతో ఉన్న జగన్… వైసీపీలో ఇంకెవర్నీ నమ్మటం లేదని, అందుకే భారతిని ఇన్వాల్వ్ చేస్తుండగా, ఇప్పుడు ఏకంగా సీఎంను చేసేందుకు స్కెచ్ వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.