
సాధారణంగా కాస్టింగ్ కౌచ్ అనగానే హీరోయిన్ లేదంటే సహాయ పాత్రల్లో నటించే నటీమణులు చేసే ఆరోపణలు మాత్రమే ! కానీ అందుకు భిన్నంగా నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ షాక్ అయ్యేలా చేస్తున్నాడు నటుడు రవికిషన్. భోజ్ పురి నటుడైన రవికిషన్ తెలుగులో అలాగే ఇతర భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించాడు.
ఇక కాస్టింగ్ కౌచ్ విషయానికి వస్తే ……. నన్ను ఒక మహిళ రాత్రికి కాఫీ తాగడానికి మా ఇంటికి రావాలని అందునా ” రాత్రికి ” అంటూ నొక్కి వక్కాణించిందని తెలిపాడు. అయితే రాత్రి అని కాస్త ఒత్తి మరీ చెప్పడంతో నేను వెంటనే అర్ధం చేసుకొని నేను రాను అని మొహమాటం లేకుండా చెప్పానని అంటున్నాడు. ఎవరైనా కాఫీ తాగేది ఉదయం ,సాయంత్రం కానీ ఆ మహిళ మాత్రం నన్ను రాత్రి పూట రమ్మందని పైగా ఆమె ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా పెద్ద పొజీషన్ లో ఉందని అంటున్నాడు.
అయితే ఆమె ఎవరు ? హీరోయినా ? లేక నిర్మాతనా ? ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్టా ? అంటే మాత్రం ”నో ” చెప్పను అని అంటున్నాడు. ఇన్నాళ్లు కాస్టింగ్ కౌచ్ బాధితులం అంటూ హీరోయిన్ లు చెప్పుకోవడం చూసాం ……. ఫస్ట్ టైం ఒక నటుడు నేను కూడా బాధితుడినే ….. అంటూ మొత్తుకుంటున్నాడు పాపం. అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం చిత్రంలో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో తెలుగులో కూడా పలు అవకాశాలు వచ్చి పడ్డాయి. అన్నట్లు రవికిషన్ నటుడు మాత్రమే కాదండోయ్ లోక్ సభ సభ్యుడు కూడా. ప్రస్తుత పార్లమెంట్ లో గోరఖ్ పూర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.






