
హీరోయిన్ అదితి రావు హైదరీపై సంచలన ఆరోపణలు చేసాడు మాజీ భర్త , నటుడు సత్యదేవ్ మిశ్రా. 2009 లో నేను – అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నామని , 2013 లోనే తీవ్ర మనస్పర్థలతో విడిపోయామని ……. ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేసాక పెళ్లి , ప్రేమ అంటే విపరీతమైన భయం ఏర్పడిందని అయితే మనిషి అన్నాక మళ్ళీ మన జీవితాన్ని కొనసాగించాలి కాబట్టి ధైర్యం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నానని అంటున్నాడు.
అంటే అదితి రావు హైదరీ నటుడు సత్యదేవ్ మిశ్రా ను బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పకనే చెబుతున్నాడన్న మాట. సత్యదేవ్ మిశ్రా కూడా నటుడే. ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పట్టుమని నాలుగేళ్ళ పాటు కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు మిశ్రా మసాబా గుప్తా ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.
అదితి రావు హైదరీ విషయానికి వస్తే ……. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవల సిద్దార్థ్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఇటీవల శర్వానంద్ వివాహ నిశ్చితార్థం జరుగగా ఆ వేడుకకు సిద్దార్థ్ – అదితి రావు ఇద్దరూ జంటగా హాజరయ్యారు దాంతో ఈ జంట మీద సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.