సీనియర్ నటి ఖుష్భూ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఖుష్భూ సోదరుడు అబ్దుల్లా ఖాన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈరోజు తుదిశ్వాస విడిచాడు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్లా ఖాన్ కు ఖుష్భూ చికిత్స చేయిస్తోంది. అన్నయ్య వైద్యానికి అయ్యే ఖర్చులను ఖుష్భూనే భరిస్తోంది.
అయితే అన్నయ్య కోలుకుంటాడని అనుకుంది. కానీ ఆమె ఆశలను అడియాసలు చేస్తూ ఈరోజు చనిపోయాడు దాంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది ఖుష్బూ. అబ్దుల్లా ఖాన్ కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఖుష్బూ కు తన సోదరులు అంటే అమితమైన ఇష్టం. చిన్నప్పుడు తండ్రి తమని ఒంటరి వాళ్ళను చేసి వెళ్లడంతో ఆ కుటుంబానికి ఖుష్బూ నే పెద్ద దిక్కు అయ్యింది. ఖుష్బూ సోదరుడు మరణించాడని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.