నా ఫ్రెండ్స్ అలియా భట్ , అతియా శెట్టి , కియారా అద్వానీ వరుసగా పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళను చూసి నేను కూడా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా. ఈ భామ ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఇప్పటి వరకు తనకు సరైన వాడు కనిపించలేదట దాంతో ఎవరినీ ప్రేమించలేదని , ఇక ఇప్పటి కిప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చెప్పండి …… పెళ్లి చేసుకుంటాను అని అంటోంది పరిణీతి.
ప్రియాంక చోప్రా కజిన్ అయిన పరిణీతి చోప్రా హాట్ భామగా సత్తా చాటింది. బాలీవుడ్ లో స్టార్ డం అందుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అయితే ఒకవైపు సినిమాలు చేస్తూనే తన స్నేహితుల పెళ్లిళ్లకు హాజరౌతూ వచ్చింది. ఇక ఇప్పుడేమో వరుసగా తన ఫ్రెండ్స్ అలియా భట్ , కియారా అద్వానీ , అతియా శెట్టి లు పెళ్లి చేసుకున్నారు.
ముగ్గురు కూడా తక్కువ వ్యవధిలోనే పెళ్లి చేసుకోవడం , ఆ ముగ్గురు తన బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో పాపం ఈ భామకు కూడా పెళ్లి మీద గాలి మళ్లిందట. బెడ్ మీద ఒంటరిగా ఎలా నిద్రపోను …….. సింగిల్ గా ఉన్నాను ….. మింగిల్ కు రెడీ అని సంకేతాలు ఇస్తోంది. కట్టుకున్న వాడి ఘాటు కౌగిలిలో తన యవ్వనమంతా కరిగిపోవాలని తపిస్తోంది. అందుకే ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చెప్పండి అని నెటిజన్లను అడుగుతోంది పరిణీతి చోప్రా.