అందాలు చూపిస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది అందాల భామ వాణి భోజన్. ఎయిర్ హోస్టెస్ గా , యాంకర్ గా , మోడల్ గా రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు సినిమాల్లోకి వచ్చింది ఈ భామ. అయితే సినిమాల్లోకి ఎంట్రీ అయితే ఇచ్చింది కానీ తనకు వస్తున్న అవకాశాలు అన్ని కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలు కావడంతో కాస్త అసహనం వ్యక్తం చేస్తోంది …… అసంతృప్తిగా ఉంది.
అందుకే కాబోలు అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్ చేసింది. అంతేకాదు అందాలు ఆరబోస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది. కాలం మారుతోంది దానితో పాటు మనం కూడా మారాల్సిందే. గ్లామర్ ఫీల్డ్ ఇది ……. అందాలు చూపించడంలో ఎలాంటి తప్పు లేదు అని సమర్ధించుకుంటోంది వాణి భోజన్.
తాజాగా ఈ భామ తమిళ రాకర్స్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా నేరుగా సోనీ లివ్ లో ఈనెల 19 నుండి స్ట్రీమింగ్ కానుంది. దాంతో ఆ సినిమా ప్రమోషన్ లలో చురుగ్గా పాల్గొంటోంది. అంతేకాదు అందాలను ఆరబోస్తూ హంగామా చేస్తోంది. అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది. మరింత మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడటానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
Breaking News