నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అఖండ మళ్లీ విడుదల అవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఈరోజు విడుదల అవుతోంది హిందీ వెర్షన్. 2021 డిసెంబర్ 2 న భారీ ఎత్తున విడుదలైన అఖండ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాలయ్య అఖండ గా అదర గొట్టడంతో భారీ వసూళ్లు నమోదయ్యాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో అఖండ 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని భావించింది అగ్ర నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్. అందుకోసమే అఖండ రీమేక్ రైట్స్ తీసుకుంది. అయితే బాలయ్య ను మ్యాచ్ చేయగల హీరో బాలీవుడ్ లో లేకపోవడంతో చేసేదిలేక అఖండ చిత్రాన్ని డబ్బింగ్ చేశారు. ఆ డబ్బింగ్ వెర్షనే ఈరోజు విడుదల అవుతోంది. జనవరి 20 న ప్రపంచ వ్యాప్తంగా అఖండ టైటిల్ తోనే విడుదల అవుతోంది.
అయితే బాలయ్య కు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి వాయిస్ సరిగా సెట్ కాలేదు. అయినప్పటికీ అఖండ ను విడుదల చేస్తున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో దైవత్వం తో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేసాయి. మరి ఆ స్థాయిలో అఖండ అఖండమైన విజయం సాధిస్తుందా ? లేదా ? అన్నది మరికొద్ది గంటల్లోనే తేలనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా కీలక పాత్రల్లో శ్రీకాంత్ , పూర్ణ తదితరులు నటించారు. తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.