మలయాళ హీరోయిన్ అన్నా రాజన్ ను కిడ్నాప్ చేశారు ఓ ప్రైవేటు టెలికాం సిబ్బంది. ఈ సంచలన సంఘటన కేరళలో జరిగింది. అసలు విషయం ఏమిటంటే…… అన్నా రాజన్ అనే హీరోయిన్ తన సిమ్ బ్లాక్ కావడంతో ఓ ప్రయివేటు టెలికాం ఆఫీస్ కు వెళ్ళింది. అయితే ఆమె తన సిబ్బందిని పంపించకుండా నేరుగా వెళ్ళింది. తనని గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ వేసుకొని వెళ్ళింది.
అయితే సిమ్ గురించి మాట్లాడే సమయంలో టెలికాం సిబ్బందికి అన్నా రాజన్ కు గొడవ జరగడంతో అన్నా రాజన్ ను ఓ గదిలో బంధించారు. దాంతో ఏమి చేయాలో తెలియక తన స్నేహితులకు ఈ విషయం ఫోన్ లో చెప్పింది. దాంతో వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఇంకేముంది రంగంలోకి దిగిన పోలీసులు టెలికాం ఆఫీసుకు వచ్చి హీరోయిన్ అన్నా రాజన్ ని విడిపించారు. అంతేకాకుండా టెలికాం సిబ్బంది ని హెచ్చరించారు పోలీసులు. అయితే తమ దగ్గరకు వచ్చింది హీరోయిన్ అని తెలియదని తమ తప్పు క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారట. దాంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది ఆ హీరోయిన్.