నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం తెలుగునాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 2021 డిసెంబర్ 2 న విడుదలైన అఖండ అఖండ విజయాన్ని అందుకుంది. బాలయ్య నటవిశ్వరూపంతో థియేటర్లన్నీ దద్దరిల్లిపోయాయి. 70 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన అఖండ థియేట్రికల్ – నాన్ థియేట్రికల్స్ రూపంలో 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
తాజాగా ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో డబ్ చేస్తోంది పెన్ ఇండియా సంస్థ. 2023 జనవరి 20 న అఖండ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఇక ఈరోజు ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు. తెలుగులో బ్లాక్ బస్టర్ అయినట్లుగానే హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు.
అసలు అఖండ చిత్రాన్ని బాలీవుడ్ హీరో రీమేక్ చేయాలని అనుకున్నారు. అయితే బాలయ్య చేసిన మ్యాజిక్ వాళ్ళ వల్ల అవుతుందో లేదో అనే అనుమానంతో రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేస్తున్నారు. ఇక జనవరి 20 న విడుదల అవుతున్న అఖండ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఇటీవల కాలంలో తెలుగు చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి.