
రణబీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటించిన చిత్రం ” బ్రహ్మాస్త్ర ”. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న సెప్టెంబర్ 9 న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్ , నాగార్జున , మౌనీ రాయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కాయి.
సినిమాకు ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాకపోయినప్పటికీ ఓపెనింగ్స్ లో మాత్రం అదరగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజునే 75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేసింది. ఎందుకంటే గతకొంత కాలంగా బాలీవుడ్ చిత్రాలు వచ్చినవి వచ్చినట్లే పోతున్నాయి. దాంతో ఈ సినిమాపై అంతగా అంచనాలు లేకుండాపోయాయి.
అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 75 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది బ్రహ్మాస్త్ర. దాంతో తప్పకుండా భారీ వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే లేదు. యావరేజ్ టాక్ మాత్రమే ఉంది. మరి ఆ యావరేజ్ టాక్ తో భారీ వసూళ్లు సాధించగలదా ? లేదా ? అన్నది చూడాలి.