రణ్ బీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటించిన చిత్రం ” బ్రహ్మాస్త్ర ”. లెజెండ్ అమితాబ్ బచ్చన్ , నాగార్జున , మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఈరోజు భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా ఓవర్ సీస్ లో అప్పుడే షోలు పడ్డాయి కాబట్టి ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను ట్విట్టర్ లో ఇస్తున్నారు.
ఇంతకీ ట్విట్టర్ రివ్యూ ప్రకారం బ్రహ్మాస్త్ర ఎలా ఉందో తెలుసా …….. హిట్ అనే అంటున్నారు. ఫస్టాఫ్ లో కొంత నెమ్మదిగా సాగుతుందని , అయితే సెకండాఫ్ ఆశించిన స్థాయిలో ఉందని అంటున్నారు. అలాగే తమ తమ రివ్యూ రేటింగ్ లను కూడా ఇస్తున్నారు. ఇప్పటివరకైతే బాగానే ఉంది టాక్. అయితే అసలైన తీర్పు మరికొద్ది గంటల్లో ప్రేక్షకులు ఇవ్వనున్నారు.
బ్రహస్త్ర చిత్రంలో కింగ్ నాగార్జున కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడంతో అభిమానులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దక్షిణ భారతదేశంలో బ్రహ్మాస్త్ర చిత్రాన్ని దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పించడం విశేషం. ఈ సినిమాను తన భుజానికి ఎత్తుకున్నారు జక్కన్న. మరి అసలైన రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.