రణబీర్ కపూర్ , అలియా భట్ , అమితాబ్ బచ్చన్ , నాగార్జున , మౌనీ రాయ్ తదితరులు నటించిన బాలీవుడ్ చిత్రం ” బ్రహ్మాస్త్ర ”. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ దిగ్గజ సంస్థలు నిర్మించాయి. భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9 న విడుదల కాబోతోంది. అయితే తాజాగా సెన్సార్ సభ్యుడు , క్రిటిక్ అయిన ఉమైర్ సందు ఈ చిత్రాన్ని చూసి తన రివ్యూ ఇచ్చేసాడు. ఇంతకీ అతడు ఇచ్చిన రివ్యూ ప్రకారం బ్రహ్మస్త్ర ఎలా ఉందంటే …… యావరేజ్ మాత్రమే అని తేల్చేసాడు.
అమితాబ్ పాత్ర చాలా బాగుంది కానీ ఆయన పాత్ర తక్కువ నిడివి మాత్రమే ఉంది. అలాగే అలియా భట్ , మౌనీ రాయ్ అద్భుతంగా నటించారు. వాళ్లకు ప్రశంసలు దక్కడం ఖాయం. కాకపోతే రణబీర్ కపూర్ నటనలో మాత్రం అంతా అయోమయంగా ఉంది. బహుశా మొత్తం కథ కూడా అతడికి తెలిసి ఉండకపోవచ్చు పాపం అంటూ ట్వీట్ చేసాడు. ఇక రేటింగ్ కూడా దారుణంగా ఇచ్చాడు.
గతంలో ఉమైర్ సందు పెద్ద ఎత్తున భారీ చిత్రాలకు రేటింగ్ ఇచ్చాడు. సూపర్ డూపర్ బంపర్ …… డంపర్ అంటూ కీర్తించాడు చాలా చిత్రాలను కానీ అవి బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందాయి. ఇక ఇపుడేమో బ్రహస్త్ర చిత్రానికి చాలా దారుణమైన రేటింగ్ ఇచ్చాడు దాంతో ఈ నెగెటివ్ కాస్త పాజిటివ్ అవుతుందని భావిస్తున్నారు పలువురు. చూడాలి సెప్టెంబర్ 9 న ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో ?