
తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా 42 వ సినిమా శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. జ్ఞానవేల్ వేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొంతమంది యువకులకు ఇస్తున్నాడు సూర్య. మంచి దేహదారుఢ్యం కలిగిన యువకులకు ఇది సువర్ణావకాశం అనే చెప్పాలి. 25 సంవత్సరాల నుండి 55 ఏళ్ళు ఉన్నవాళ్లు ఇందుకు అర్హులు. అలాగే పొడవైన జుట్టు , గుబురు గడ్డం అలాగే మంచి ఫిజిక్ ఉన్నవాళ్లు వెంటనే మీ ఫోటోలను మెయిల్ చేస్తే అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి ఆడిషన్స్ నిర్వహిస్తారు.
అందులో సెలెక్ట్ అయినవాళ్లకు సూర్య సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది. సూర్య సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యే సినిమా కాబట్టి సినిమాల్లో నటించాలని ఆశపడే యువకులకు ఇది సువర్ణావకాశం. ఇక ఆలస్యం ఎందుకు వెంటనే EMAIL ID : [email protected] కు మీ ఫోటోలు పంపించండి.
దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి చేసుకుంది.