
ఆస్కార్ బరిలో నిలిచిన ఛల్లో షో (ద లాస్ట్ షో ) బాలనటుడు రాహుల్ కోలీ (10) కన్నుమూశాడు. విషాదం ఏంటంటే ……. గతకొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు ఈ బాలుడు. చిన్న వయసులోనే క్యాన్సర్ తో బాధపడుతుండటంతో చికిత్స పొందుతున్నాడు. అయితే వ్యాధి ముదరడంతో రక్తపు వాంతులు చేసుకొని మరణించాడు. దాంతో రాహుల్ కోలీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
ఛల్లో షోలో ఆరుగురు అబ్బాయిలు నటించగా అందులో ఒక బాలుడు ఈ రాహుల్. ఛల్లో షో మరో రెండు రోజుల్లో విడుదల అవుతుందనగా ఇలా ఆసినిమాలో నటించిన బాలనటుడు మరణించడంతో ఛల్లో షో బృందంలో కూడా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కళ్ళ ముందే నా కొడుకు గిల గిలా కొట్టుకుంటూ రక్తపు వాంతులు చేసుకుంటూ చనిపోయాడని బోరున విలపిస్తున్నాడు బాలుడి తండ్రి రాము కోలీ.