సైబర్ నేరగాళ్లు ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ తమ పబ్బం గడుపుతూ పెద్ద ఎత్తున నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎంతగా రెచ్చిపోతున్నారో అటు బ్యాంక్ అధికారులు ఇటు పోలీస్ సిబ్బంది మొత్తుకుంటున్నా అవేర్ నెస్ కార్యక్రమాలు చేపడుతున్నా ఈ నేరాలు మాత్రం ఆగడం లేదు. విచిత్రం ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ బాధితుల్లో సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు.
తాజాగా మలయాళ నటి శ్వేతా మీనన్ కూడా సైబర్ నేరగాళ్ల మాయలో పడింది. బ్యాంక్ అధికారులమని పాన్ కార్డు వివరాలను అప్ డేట్ చేసుకోవాలని ఫోన్ లు చేస్తూ లింక్ లను పంపిస్తున్నారు. ఆ లింక్ లు ఓపెన్ చేస్తే ఖాతాలో ఉన్న డబ్బు మాయం అవుతోంది. నటి శ్వేతా మీనన్ కు ఇలాగే లింక్ పంపించగా అది నిజమేనని ఓపెన్ చేసింది …… ఇంకేముంది శ్వేతా మీనన్ ఖాతాలోంచి 57,636 మాయమయ్యాయి. దాంతో లబోదిబో మంటూ బ్యాంక్ అధికారులతో పాటుగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. శ్వేతా మీనన్ ని మాత్రమే కాదు ఇలా 40 మందిని మోసం చేసారు సైబర్ నేరగాళ్లు.
మలయాళ నటి శ్వేతా మీనన్ 90 వ దశకంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. మళయాళంలోనే కాకుండా తెలుగు , తమిళ చిత్రాల్లో కూడా నటించింది.