
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆసుపత్రిలో చేరింది. దాంతో ఒక్కసారిగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ – కె షూటింగ్ లో పాల్గొన్న సమయంలో దీపికా కళ్ళు తిరిగి పడిపోవడంతో కామినేని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసారు. అప్పట్లో అది సంచలనంగా మారింది.
కట్ చేస్తే తాజాగా ఓ బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో వెంటనే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. వైద్య పరీక్షల తర్వాత దీపికా పదుకొణెని ఆసుపత్రిలో జాయిన్ కావాల్సిందిగా సూచించడంతో వెంటనే జాయిన్ అయ్యింది.
ప్రస్తుతం డాక్టర్లు దీపికాకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న దీపికా పదుకొణె ఆరోగ్యం పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ఇక భర్త , హీరో రణ్వీర్ సింగ్ దీపికా పక్కనే ఉండి ధైర్యం చెబుతున్నాడట. అయితే అభిమానుల్లో మాత్రం దీపికా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు.