2018 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట దీపికా పదుకొణె – రణ్వీర్ సింగ్. నాలుగేళ్ళ పాటు వీళ్ళ కాపురం సజావుగానే సాగింది. అడపా దడపా అలకలు , మురిపాలు వైగరా …… వైగరా . అయితే తాజాగా బాలీవుడ్ లో వినిపిస్తున్న కథనం ప్రకారం దీపికా – రణ్వీర్ లు విడాకులు తీసుకోనున్నట్లుగా ఊహాగానాలు చెలరేగాయి.
ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా దీపికా పదుకొణె తన చేతి వెలికి ఉన్న ఉంగరం తీసేసింది. వివాహ నిశ్చితార్ధ సమయంలో రణ్వీర్ దీపికాకు ఉంగరం తొడిగాడు. కాగా ఆ ఉంగరం ఇప్పుడు దీపికా చేతికి లేదు. దాంతో దీపికా చేతికి ఉంగరం లేని ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తూ విడాకులకు ఇది సంకేతమా ? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇదే రూమర్ కొద్దిరోజుల క్రితం కూడా వినిపించింది. దాంతో ఎట్టకేలకు స్పందించాడు రణ్వీర్ సింగ్. అవన్నీ గాలి వార్తలు మాత్రమే అంటూ కొట్టి పడేసాడు. రణ్వీర్ ఈ వార్తలను కొట్టి పడేసినప్పటికీ దీపికా మాత్రం స్పందించలేదు. దాంతో ఈ వార్తలు వైరల్ గా మారాయి. దీపికా పదుకొణె ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ – కె చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఆ సినిమా షూటింగ్ లోనే అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అలాగే ఇటీవల మరోసారి అస్వస్థతకు లోనవ్వడంతో ముంబై లోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యింది.