బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 57 వ పుట్టినరోజు వేడుకలు ఇటీవల ముంబైలో జరిగాయి. కాగా ఆ వేడుకల్లో పలువురు హీరోలు , హీరోయిన్ లు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో సల్మాన్ మాజీ లవర్ సంగీత బిజ్ లానీ కూడా పాల్గొంది. ఆమె ఈ మొత్తం వేడుకలో హైలెట్ గా నిలిచింది.
మాజీ ప్రియుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి రావడంతో గట్టిగా హత్తుకొని అప్పటి మధురానుభూతులను నెమరువేసుకున్నారు. అలాగే సంగీత బిజ్ లానీని ముద్దు పెట్టుకుని తన ప్రేమను , అభిమానాన్ని చాటాడు సల్మాన్. సంగీత బిజ్ లానీ కి 62 సంవత్సరాలు కాగా సల్మాన్ ఖాన్ కు 57 సంవత్సరాలు మాత్రమే . అప్పట్లో ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు……. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు రావడంతో విడిపోయారు.
సరిగ్గా అదే సమయంలో క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ తో ప్రేమలో పడింది. 1996 లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు కాపురం సజావుగానే సాగింది. అయితే అజార్ – సంగీత ల మధ్య విబేధాలు రావడంతో 2010 లో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి ఒంటరిగానే ఉంటోంది సంగీత. ఇక ఇప్పుడేమో మాజీ ప్రియుడి పుట్టినరోజు కావడంతో ప్రేమతో వెళ్ళింది. అదే ప్రేమతో ఆలింగనం చేసుకొని తమ ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు సంగీత ను కారులో ఎక్కించి మరీ పంపించాడు సల్మాన్. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.