ఆస్కార్ హంగామా మొదలైంది. అయితే అనూహ్యంగా ఆస్కార్ బరిలో భారత్ నుండి లాస్ట్ ఫిల్మ్ షో (గుజరాతీ భాషలో ఛేల్లో షో ) ఎంపిక కావడం సంచలనంగా మారింది. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో నిలుస్తుంది అవార్డు గెలుస్తుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా గుజరాతీ ఫిలిం లాస్ట్ ఫిల్మ్ షో ఎంపిక కావడంతో ఎన్టీఆర్ , చరణ్ అభిమానులు కేంద్ర ప్రభుత్వ తీరుని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
ఇక లాస్ట్ ఫిల్మ్ షో విషయానికి వస్తే ……… భవిన్ రాబరీ , భవేష్ శ్రీమాలి , రిచా మీనా , ఢిఫెన్ రావల్ తదితరులు నటించారు. గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు సినిమా ప్రొజెక్టర్ టెక్నీషియన్ తో స్నేహం చేసుకొని వేసవి కాలంలో ఆ థియేటర్ లో చాలా సినిమాలు ప్రొజెక్షన్ రూమ్ నుండి చూస్తాడు. దాంతో అతడిపై సినిమాల ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రొజెక్షన్ ని సొంతంగా చేయాలనే ఆలోచన వస్తుంది. ఇదీ ఆ చిత్ర కథ.
ఈ సినిమా పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లలో ప్రదర్శించబడింది. ఇక ఇప్పుడేమో ఏకంగా ఆస్కార్ బరిలో భారత్ తరుపున నామినేట్ అవుతుండటంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో నిలుస్తుందని భావించిన వాళ్ళు తీవ్ర నిరాశకు గురయ్యారు.