
నాకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం , ఎక్స్ పోజింగ్ చేయడం ఇష్టం లేదు కానీ ఈ రెండూ చేయక తప్పడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ ” హుమా ఖురేషి ”. 36 ఏళ్ల ఈ భామ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. దాదాపు పదేళ్ల క్రితం కెరీర్ ప్రారంభించింది హుమా ఖురేషి. ఆశించిన స్థాయిలో స్టార్ డం పొందలేకపోయింది కానీ సత్తా చాటుతూనే ఉంది.
ఇక ఎక్స్ పోజింగ్ విషయంలో మొహమాటం అంటూనే అందాలన్నీ ఉదారంగా ఆరబోస్తూనే ఉంది. రకరకాల ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. ఇక రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చి వాటిని సోషల్ మీడియాలో పెడుతోంది. ఇలా చేయడం నాకు ఇష్టం లేదు కాకపోతే నలుగురితో నారాయణ …… తప్పదు కదా ! అని సుద్ధనీతులు చెబుతోంది.
భారీ సైజ్ అందాల భామ హుమా ఖురేషి తాజాగా ” డబుల్ XL ” అనే సినిమాలో నటించింది. మరో భారీ సైజ్ అందాల భామ సోనాక్షి సిన్హా తో కలిసి నటించింది. ఈ ఇద్దరు కూడా భారీ అందాల భామలు. మంచి ఒడ్డు – పొడవు ఉన్న భామలు కావడంతో….. భారీ కాయులు కావడంతో డబుల్ XL లో నటించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రసారం కానుంది. అన్నట్లు సౌత్ లో కూడా నటించారు ఈ ఇద్దరూ పైగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో సౌత్ లో మళ్ళీ అవకాశాలు దక్కలేదు.