
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో అందాల భామ ఐశ్వర్యారాయ్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తన సినిమాలో సీనియర్ హీరోయిన్ లను ఓ ముఖ్య పాత్రలో నటింప జేయడం చాలా కామన్ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్ భామలను తన సినిమాలో యాక్ట్ చేయించాడు.
ఇప్పుడు ఆ జాబితాలో ఐశ్వర్యారాయ్ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఫైనల్ కాలేదు కానీ ఐశ్వర్యారాయ్ ని సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకులు త్రివిక్రమ్. ఒకవేళ ఐశ్వర్య ఒప్పుకుంటే ఈ సినిమాకు మరో హైలెట్ గా నిలుస్తుందని భావిస్తున్నాడట. ఇక ఈ పాత్ర ఏంటో తెలుసా ……. నెగెటివ్ రోల్.
ఐశ్వర్యారాయ్ ఇంతకుముందు పొన్నియన్ సెల్వన్ సినిమాలో నెగెటివ్ రోల్ పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే. అందాలతో చంపేయడమే కాకుండా ఇలా ప్రతినాయక పాత్రలో కూడా మెప్పించే సత్తా ఉన్న నటి కావడంతో ఆమెను సంప్రదించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడట త్రివిక్రమ్. ఒకవేళ ఆమె కాదంటే అప్పుడు మాత్రమే రమ్యకృష్ణ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా రెండో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తున్న విషయం తెలిసిందే.