అందాల భామ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాలను ఉదారంగా ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ భామ భారీ డిజాస్టర్ ని తప్పించుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రంలో మొదట హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది జాన్వీ కపూర్ కు కావడం విశేషం. దర్శకులు పూరీ జగన్నాథ్ మొదట జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలనే జాన్వీ ని కలిసాడు ముంబైలో. విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ కావడంతో వెంటనే ఒకే చెప్పింది.
అయితే పూరీ జగన్నాథ్ కోరిన డేట్ మాత్రం అడ్జెస్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే తనకు అప్పటికే కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి దాంతో మీరడిగిన డేట్స్ ఖాళీగా లేవు అని చెప్పడంతో జాన్వీ కోసం ఆగడం ఇష్టం లేక అనన్య పాండే ని హీరోయిన్ గా తీసుకున్నాడు. మైక్ టైసన్ , రమ్యకృష్ణ తదితరులతో లైగర్ తీసాడు…… కట్ చేస్తే డిజాస్టర్ అయ్యింది.
దాంతో జాన్వీ కపూర్ భారీ డిజాస్టర్ నుండి తప్పించుకున్నట్లైంది. గతంలో కూడా పలు చిత్రాల్లో జాన్వీ కి అవకాశాలు వచ్చాయి. కానీ జాన్వీ మాత్రం వాటిని తిరస్కరించింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లెవల్ మారింది కాబట్టి తప్పకుండా మంచి ఆఫర్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉందట.
Breaking News