కె. విశ్వనాథ్ తో విడదీయరాని అనుబంధం ఉంది కమల్ హాసన్ కు దాంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు కమల్. అలాగే బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూడా. విశ్వనాథ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కమల్ , అనిల్ కపూర్ . ఇక కమల్ విషయానికి వస్తే ……. సాగర సంగమం , స్వాతి ముత్యం , శుభ సంకల్పం చిత్రాలు వచ్చాయి. ఈ మూడు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
కమల్ హాసన్ లోని గొప్ప నటుడ్ని వెలికి తీసిన దర్శకుడు కె. విశ్వనాథ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి మాస్ హీరో అయినా వాళ్ళను తన కోణంలో చూపించే అరుదైన దర్శకుడు విశ్వనాథ్ మాత్రమే ! ఎందుకంటే కమల్ హాసన్ , చిరంజీవి , అనిల్ కపూర్ ఈ ముగ్గురు కూడా మాస్ హీరోలు అయినప్పటికీ వాళ్ళను క్లాస్ హీరోలుగా చూపించి విజయాలు కట్టబెట్టిన దర్శకుడు విశ్వనాథ్.
అనిల్ కపూర్ హీరోగా ఈశ్వర్ అనే సినిమాను బాలీవుడ్ లో చేసారు. స్వాతిముత్యం చిత్రాన్ని హిందీలో ఈశ్వర్ గా రీమేక్ చేసారు కళాతపస్వి విశ్వనాథ్. అలాగే చిరంజీవి స్వయం కృషి అనే గొప్ప చిత్రాన్ని చేసాడు. చిరంజీవి ఆ చిత్రంలో చెప్పులు కుట్టుకునే వ్యక్తిగా నటించడం విశేషం. అలాగే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం అప్పట్లో సంచలనమే అయ్యింది. తమకు నటనలో ఎన్నో మెళుకువలు నేర్పిన విశ్వనాథ్ పరమపదించడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు కమల్ హాసన్ , చిరంజీవి , అనిల్ కపూర్.