సెక్స్ బాంబ్ కంగనా రనౌత్ యూత్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి యువతరానికి సెక్స్ పట్ల అంతగా ఆసక్తి లేదని , కమిట్ మెంట్ లేదని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది. 1996వరకు ఉన్న యూత్ సెక్స్ పట్ల కమిట్ మెంట్ ఉన్నవాళ్ళని కానీ ఇప్పటి తరం మాత్రం చాలా బద్ధకిస్టులు అంటూ బాంబ్ పేల్చింది కంగనా రనౌత్.
వివాదాలకు , వివాదాస్పద అంశాలకు కేరాఫ్ అడ్రస్ అయిన భామ కంగనా రనౌత్. పలు అంశాలపై మొహమాటం లేకుండా మాట్లాడి పలు వివాదాలలో చిక్కుకుంది. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ భామ తరచుగా ఏదో ఒక కామెంట్ చేసి సంచలనం సృష్టించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే మిగతా విషయాల పట్ల ఈ భామ అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ఇప్పటి యువతరానికి సంబందించిన సెక్స్ విషయం పట్ల చేసిన కామెంట్ మాత్రం నిజమే అని అంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ……. తాజాగా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో సినిమా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఎమర్జెన్సీ సినిమా విడుదల అయితే తప్పకుండా పెద్ద వివాదం చెలరేగడం ఖాయం. ఎందుకంటే ఇందిరాగాంధీ వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఈ సినిమా ఉండబోతోంది అని అంటోంది బాలీవుడ్ మీడియా.