ఇతరుల సెక్స్ లైఫ్ ముచ్చట్లు నాకు చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి అందుకే వాటిని వినడానికే ఎక్కువ సమయం కేటాయిస్తానని అంటున్నాడు వివాదాస్పద దర్శక నిర్మాత కరణ్ జోహార్. తన టాక్ షో కు పలువురు స్టార్ లను ఆహ్వానిస్తుంటాడు. అంతేకాదు ఎటువంటి వాళ్లతో నైనా సరే ఇంటర్వ్యూ చేసాడంటే తప్పకుండా అందులో సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు ఉంటాయి.
అలా ప్రశ్నలు వేస్తూ వాళ్ళు సమాధానం చెబుతుంటే చాలా చాలా ఆసక్తిగా ఉంటుందట ఇతగాడికి. అందుకే అలాంటి ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ వేస్తుంటాడు. అన్నట్లు కరణ్ జోహార్ ” గే ”. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు సుమా ! తానే స్వయంగా వెల్లడించాడు. బాలీవుడ్ లో పాతుకుపోయిన కరణ్ జోహార్ పలు చిత్రాలను విడుదల చేస్తుంటాడు కూడా. అలా మన తెలుగు చిత్రాలను కూడా హిందీలో విడుదల చేసాడు. అందులో బాహుబలి , బాహుబలి 2 బ్లాక్ బస్టర్ లు అయ్యాయి.