మాకు పెళ్లి అయ్యాక రాత్రి వరకు శోభనం కోసం ఎదురు చూడలేదని , మధ్యాహ్నమే శృంగారంలో పాల్గొన్నామని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ కత్రినా కైఫ్ . 2021 డిసెంబర్ 9 న అట్టహాసంగా విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయ్యాక శోభనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు , ముహుర్తాలు చూస్తారు. కానీ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ మాత్రం పట్టపగలే తమ శోభనం చేసుకున్నారట.
ఈ శోభనం విషయాన్ని కత్రినా కైఫ్ స్వయంగా వెల్లడించడం విశేషం. తాజాగా కరణ్ జోహార్ ” కాఫీ విత్ కరణ్ ” షోలో పాల్గొంది కత్తిలాంటి కత్రినా కైఫ్ . ఇక కరణ్ ఎలాంటి విషయాలను ఎక్కువగా అడుగుతాడో అందరికీ తెలిసిందే. కత్రినాను కూడా శోభనం గురించి అడగ్గా ఏమాత్రం సిగ్గుపడకుండా తమకు జరిగిన శోభనం గురించి పూసగుచ్చినట్లు చెప్పింది.