
స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన ఫస్ట్ నైట్ గురించి ఓపెన్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ లో తన మొదటి రాత్రి తాలూకు అనుభవాలను పంచుకుంది. తన మొదటి రాత్రి తనకు ఎంతో స్పెషల్ అని ……. మధుర జ్ఞాపకాలను పంచిందంటూ పేర్కొంది. ఇంకేముంది ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్దార్థ్ మల్హోత్రా తో తనకు జరిగిన ఫస్ట్ నైట్ గురించి వ్యాఖ్యానిస్తూ ఊహాలోకాల్లో తేలిపోతోంది కియారా అద్వానీ.
బాలీవుడ్ భామ కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి విషయాన్నీ చివరి నిమిషం వరకు కేసుల దాచి పెట్టింది. తీరా సమయానికి తన పెళ్లి విషయాన్ని వెల్లడించింది. రాజస్థాన్ లోని సూర్య ఘడ్ ప్యాలెస్ లో కియారా అద్వానీ – సిద్దార్థ మల్హోత్రా పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి అయిన వెంటనే హనీమూన్ కు వెళ్లారు. హనీమూన్ పూర్తి చేసుకొని ముంబైకి తిరిగి వచ్చిన సమయంలో పలువురు హనీమూన్ గురించి వ్యాఖ్యానించారు. అప్పుడు సమాధానం చెప్పలేదు కానీ ఇంస్టాలో మాత్రం ” సంథింగ్ అబౌట్ దట్ నైట్ …… సంథింగ్ రియల్లీ స్పెషల్ ” అంటూ పేర్కొంది. అది ఇప్పుడు వైరల్ గా మారింది.