బాలీవుడ్ హాట్ భామ కియారా అద్వానీ గర్భవతి అయ్యాకే పెళ్లి చేసుకుందా ? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అంతేకాదు కొంతమంది అదేపనిగా పెట్టుకొని అలియా భట్ – రణబీర్ కపూర్ లాగే ఈ జంట కూడా పెళ్ళికి ముందే తొందర పడ్డారని , గర్భం దాల్చిన తర్వాతే పెళ్లి చేసుకున్నారని విమర్శలు చేస్తున్నారు.
కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. అయితే ఈ ప్రేమ విషయం ఎక్కడా బయటపెట్టలేదు. మీడియాలో రకరకాల కథనాలు వచ్చినా స్పందించలేదు. కట్ చేస్తే పెళ్లి జరగబోతోంది అని మీడియాలో కథనాలు వచ్చినా అలాగే చేసారు. కట్ చేస్తే రాజస్థాన్ లో ఫిబ్రవరి 7 న పెళ్లి చేసుకున్నారు.
ఇక ఇప్పుడేమో బిగ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటూ పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది కియారా అద్వానీ. పెళ్లి అయ్యాక బిగ్ న్యూస్ అంటే కేవలం తల్లి కావడమ్ మాత్రమే బిగ్ న్యూస్ అవుతుంది అంతేకాని మరొకటి కాదు. పైగా ప్లేట్ లో మామిడి ముక్కలు ఫుల్లుగా పెట్టేసుకొని వాటిని తింటోంది. కాకపోతే అది మామిడి పండు ముక్కలు. గర్భం దాల్చితే మాత్రం పచ్చి మామిడి బాగా తినాలనిపిస్తుంది ఆడవాళ్లకు.
అంటే ఈ రకంగా హింట్ ఇచ్చినట్లు అన్నమాట. త్వరలోనే నేను తల్లి కాబోతున్నాను …… గర్భం దాల్చాను అని చెప్పకనే చెబుతుందా ? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కామెంట్ చేస్తున్నారు. కియారా అద్వానీ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మళ్ళీ రాంచరణ్ తో శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.