భారత క్రికెటర్ KL రాహుల్ – అతియా శెట్టి ల పెళ్లి ఖాయమని కాకపోతే వాళ్ళు అనుకూలమైన సమయంలో మాత్రమే పెళ్లి చేసుకుంటారు అంటూ అసలు విషయాన్ని వెల్లడించాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురే రాహుల్ లవర్ అతియా శెట్టి. గతకొంత కాలంగా రాహుల్ – అతియా శెట్టి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు.
ఈ ఇద్దరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేసాయి. అయితే వాటిపై పెద్దగా స్పందించలేదు ఈ ఇద్దరు కూడా. అయితే అప్పట్లో సునీల్ శెట్టి రాహుల్ – అతియా శెట్టి ల ప్రేమ గురించి హింట్ ఇచ్చాడు కూడా. ఇక సోషల్ మీడియాలో రాహుల్ – అతియా ల జోడీ హంగామా అంతాఇంతా కాదు. కట్ చేస్తే వాళ్ళ బంధాన్ని కన్ఫర్మ్ చేసాడు సునీల్ శెట్టి. రాహుల్ భారత్ తరుపున కీలక మ్యాచ్ లు ఆడనున్నాడు దాంతో పెళ్లి ఆలస్యం కానుందని , క్రికెట్ మ్యాచ్ లు పూర్తయ్యాక ఓ మంచి రోజు చూసుకొని పెళ్లి చేసుకోనున్నారు.
Breaking News