లైగర్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ ” అనన్య పాండే ”. తాజాగా ఈ భామకు ఘోర అవమానం జరిగింది. తాజాగా ఈ భామ ” మజా మా ” అనే సినిమా స్క్రీనింగ్ కి వెళ్ళింది. అక్కడికి షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ వచ్చాడు. అయితే ఎదురుగా అనన్య పాండే ఉన్నప్పటికీ ఆమెను పట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు ఆర్యన్. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో నెటిజన్లు ఆర్యన్ ని అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు.
అనన్య పాండే కు ఆర్యన్ అంటే క్రష్ ఉందట. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు ఈ భామే స్వయంగా వెల్లడించింది. దాంతో సహజంగానే తాను ఇష్టపడే వ్యక్తి కనిపించినప్పుడు ఆరాధనా భావంతో చూడటం సహజం. ఈ భామ అలాగే చేసింది కూడా. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం తన ఎదురుగా ఉన్న అనన్య పాండే ని అస్సలు పట్టించుకోకుండా ఆమెను దాటుకుంటూ వెళ్ళిపోయాడు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించింది అనన్య పాండే. లైగర్ చిత్రంతో ఈ భామ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవచ్చని అనుకుంది పాపం. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది దాంతో ఈ భామ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి.