
పవర్ స్టార్ పై రాళ్లదాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో పవర్ స్టార్ ముఖానికి గాయాలు అయ్యాయి దాంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పవర్ స్టార్ పై రాళ్ల దాడి జరగడం ఏంటి ? ఎప్పుడు ? ఎక్కడ జరిగింది ? పవన్ కళ్యాణ్ కు ఏమైంది ? అని ఆత్రుత పడుతున్నారా ? పవర్ స్టార్ అనగానే పవన్ కళ్యాణ్ గుర్తుకు రావడం సహజం. అయితే ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు సుమా ! భోజ్ పురి నటుడు పవర్ స్టార్ పవన్ సింగ్.
భోజ్ పురి లో పవర్ స్టార్ గా బిరుదు అందుకున్నాడు పవన్ సింగ్. తాజాగా హోలీ వేడుకలు జరుగుతుండటంతో ఓ ఈవెంట్ ను ఉత్తరప్రదేశ్ లోని బల్దియా జిల్లాలో ఏర్పాటు చేసారు నిర్వాహకులు. ఆ షోకు వెళ్లిన పవర్ స్టార్ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గుంపులోంచి ఓ రాయి వచ్చి పవర్ స్టార్ ముఖానికి తగిలింది. ఆ వెంటనే వరుసగా మరికొన్ని రాళ్లు పవర్ స్టార్ మీద పడ్డాయి. దాంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
గాయపడిన పవర్ స్టార్ పవన్ సింగ్ కు విపరీతమైన కోపం వచ్చింది. అంతే దమ్ముంటే ముందుకు వచ్చి రాళ్లు వేయండిరా …… గుంపు లో ఉండి కాదు అంటూ అరిచాడు. దాంతో ఆ అల్లరి మూక తోకముడిచింది. ఇంకేముంది నిర్వాహకులు షో ఆపేసారు. పవర్ స్టార్ ను ఆసుపత్రికి తరలించారు.