
సీతారామం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిన భామ మృణాల్ ఠాకూర్. ఆ సినిమా ఇచ్చిన జోష్ లో ఈ భామకు ఎడాపెడా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. సీతారామం చిత్రంలో హోమ్లీ క్యారెక్టర్ లో తన పెర్ఫార్మెన్స్ తో అలరించింది. అయితే అన్ని సినిమాలు అలా రావు కదా !అందుకే తన స్టార్ డం పెరిగేలా ఎలాంటి అవకాశం వచ్చినా చేయడానికి రెడీ అవుతోంది.
తాజాగా బాలీవుడ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి షాక్ ఇచ్చింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ” సెల్ఫీ ” అనే బాలీవుడ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది మృణాల్ ఠాకూర్. ఇక ఈ ఐటెం సాంగ్ లో మృణాల్ అదరగొట్టింది. అందాలను ఆరబోసి పిచ్చెక్కించింది. మృణాల్ అందాలను చూస్తూ కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.
సెల్ఫీ సినిమా ఈనెల 24 న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మృణాల్ కేవలం ఐటెం సాంగ్ కు మాత్రమే పరిమితమైంది. ఈ సినిమా హిట్ అయితే తప్పకుండా మృణాల్ ఠాకూర్ కు ప్రయోజనం ఉంటుంది. సీరియల్స్ తో ఫేమస్ అయిన మృణాల్ కు సీతారామం సినిమా తిరుగులేని , మరిచిపోలేని పాత్ర లభించింది. ఆ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేసింది. అవకాశం దక్కితే ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ అని చెప్పకనే చెప్పింది ఈ సినిమాతో.