
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నెటిజన్లు అంటే ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అమీర్ ఖాన్ పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అమీర్ పై ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …….. నుదుట బొట్టు పెట్టుకొని , తన మాజీ భర్య కిరణ్ రావుతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడమే.
అమీర్ ఖాన్ ముస్లిం అనే విషయం తెలిసిందే. ముస్లిం లు నుదుట బొట్టు పెట్టుకోరు. కానీ అందుకు విరుద్దంగా అమీర్ ఖాన్ బొట్టు పెట్టుకోవడమే కాకుండా తన మాజీ భార్య కిరణ్ రావు తో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు దాంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే హిందూ సంప్రదాయాలను పాటిస్తావా ? అంటూ మండిపడుతున్నారు.
కిరణ్ రావు హిందువు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అమీర్ ఖాన్. అయితే ఇటీవలే ఈ ఇద్దరూ విడిపోయారు ……. విడాకులు తీసుకున్నారు. విడాకులు అయితే తీసుకున్నారు కానీ కలిసే సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఓ సినిమా ఆఫీసు తీసుకున్నారు. ఆ ఆఫీసు ప్రారంభోత్సవం సందర్బంగా అమీర్ ఖాన్ ఇలా కనిపించడంతో కొంతమందికి కాలింది. అంతే ఘాటుగా విమర్శిస్తున్నారు. అయితే ఇదే సమయంలో అమీర్ ను అభినందించే వాళ్ళు కూడా ఉన్నారు సుమా !.