
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం పఠాన్. దీపికా పదుకొనె , జాన్ అబ్రహం తదితరులు నటించిన ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. షారుఖ్ ఖాన్ నాలుగేళ్ళ తర్వాత నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే అదే సమయంలో పలు వివాదాలు ఈ సినిమాను చుట్టుముట్టాయి. దాంతో ఈ సినిమా విడుదల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు జనవరి 25 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా పఠాన్ సినిమా విడుదల అయ్యింది. దాంతో ఈ సినిమాను చూసిన వాళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు.
ఇంతకీ ట్విట్టర్ వీరుల ప్రకారం పఠాన్ సినిమా ఎలా ఉందో తెలుసా…….. బ్లాక్ బస్టర్ అనే అంటున్నారు. షారుఖ్ ఖాన్ కు నిజంగా ఇది కమ్ బ్యాక్ సినిమా అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో పఠాన్ సినిమా పట్ల అసంతృప్తి వ్యక్తం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓవరాల్ గా షారుఖ్ ఖాన్ మాత్రం హిట్ కొట్టినట్లే కనబడుతోంది. ఇక అసలైన తీర్పు కొద్ది గంటల్లోనే ప్రేక్షకులు ఇవ్వనున్నారు.