బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2023 జనవరి 2 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం పోషిస్తున్న ఈ చిత్రంలో హాట్ భామ ప్రియమణి ఐటెం సాంగ్ చేయనుంది.
సౌత్ లో హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన ఈ భామకు ఇక హీరోయిన్ గా అవకాశాలు దక్కడం లేదు. దాంతో డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే షారుఖ్ ఖాన్ జవాన్ లో ఐటెం సాంగ్ చేయడానికి ప్రియమణి కి ఛాన్స్ లభించడంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. షారుఖ్ ఖాన్ హీరో నయనతార హీరోయిన్ ….. అట్లీ దర్శకత్వంలో సినిమా అంటే మాములు విషయం కాదు కదా…. భారీ స్థాయిలో విడుదల అవుతుంది. భారీ సినిమాలో ఐటెం సాంగ్ అంటే పీక్స్ కెళ్లడం ఖాయం. దాంతో తనకు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందనే ఆనందంలో ఉంది ప్రియమణి.