డార్లింగ్ ప్రభాస్ తో రొమాన్స్ చేయడానికి దీపికా పదుకోన్ 10 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ భామ ప్రాజెక్ట్ – కె చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ – K చిత్రాన్ని అగ్ర నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకోన్ ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసిందట. పాన్ ఇండియా చిత్రం కావడంతో దీపికా పదుకోన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీపికా పదుకోన్ బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ఆభామకు డిమాండ్ ఉంది. అయితే ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా సరే 10 కోట్లు ఇచ్చే అవకాశం లేదు.
కానీ దీపికా పదుకోన్ మాత్రం తనకు 10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తేనే చేస్తాను అని డిమాండ్ చేసిందట. దాంతో రీజనబుల్ అమౌంట్ అని ఆ మొత్తాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా …….. 150 కోట్లు. ప్రభాస్ కు 150 కోట్లు ఇస్తున్నప్పుడు దీపికా పదుకోన్ కు 10 కోట్లు ఇవ్వడంలో తప్పే లేదు.