సెక్స్ పాఠాలు చెబుతానంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కండోమ్ ను ఎలా వాడాలో …… ఎలాంటి కండోమ్ ను వాడాలో సవివరంగా చెబుతానని , పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదని , అలాంటి సమయంలో ఎలాంటి కండోమ్ వాడాలో చెప్పేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ లాంటి స్టార్ హీరోయిన్ సెక్స్ పాఠాలు చెబుతానని అనడం ఏంటని షాక్ అవుతున్నారా ?
అసలు విషయం ఏంటంటే ……. ఛత్రివాలి అనే సినిమాలో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో కండోమ్ ఫ్యాక్టరీలో తయారయ్యే కండోమ్ లు క్వాలిటీగా ఉన్నాయా ? లేదా ? అని వాటిని ఉపయోగించి చూసే పాత్రలో రకుల్ నటిస్తోంది. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్రజల్లో పలు అపోహలు ఉన్నాయి …… ఆ అపోహలను తొలగించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
సుమీత్ వ్యాస్ హీరోగా నటించగా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తేజాస్ డియోస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని థియేటర్ లలో విడుదల చేయాలనుకున్నారు. అయితే సరైన థియేటర్లు లభించకపోవడంతో , అదే సమయంలో ఓటీటీలో మంచి ఆఫర్ రావడంతో జీ 5 లో నేరుగా విడుదల చేస్తున్నారు. జనవరి 20 న జీ 5 లో స్ట్రీమింగ్ కు వస్తోంది ఛత్రివాలి. దాంతో రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది.
View this post on Instagram