
బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నటీమణులు సాజిద్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేయగా తాజాగా భోజ్ పురి నటి, ఐటమ్ భామ రాణి చటర్జీ సాజిద్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. నా రొమ్ముల సైజ్ ఎంత అని ప్రశ్నించడమే కాకుండా తన రెండు చేతులను నా ఎదపై వేయడానికి పలుమార్లు ప్రయత్నించాడని , అంతేకాకుండా చాలా అసభ్యంగా ప్రవర్తించడాని అంటోంది.
సాజిద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన హిమ్మత్ వాలా చిత్రంలో రాణి చటర్జీ ఐటమ్ సాంగ్ చేసింది. ఆ పాట చిత్రీకరిస్తున్న సమయంలో నన్ను ఒంటరిగా తన గదికి రమ్మని, క్యారవాన్ కు రమ్మని అనేవాడు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ? అతడితో సెక్స్ లో పాల్గొన్నావా ? సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశావ్ ? అంటూ చాలా అసభ్యంగా మాట్లాడటమే కాకుండా నా శరీరం పై ఎక్కడెక్కడో చేతులు వేసేవాడని , అందుకే ఆ పాట పూర్తయ్యాక మళ్లీ అతడ్ని కలవలేదని సాజిద్ ఖాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.