బాలీవుడ్ లో వివాదాస్పద భామగా పేరున్న రిచా చద్దా తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదాన్ని సృష్టించింది. పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురు కావడంతో సదరు పోస్ట్ ను తొలగించింది రిచా చద్దా. ఇంతకీ ఈ వివాదం విషయం ఏంటో తెలుసా ….. ఇండియన్ ఆర్మీ తాజాగా ఓ ట్వీట్ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని భారత ఆర్మీ ట్వీట్ చేయడంతో దానికి కౌంటర్ ఇస్తూ ”గాల్వాన్ సేస్ హాయ్ ” అంటూ ఘోర అవమానకరమైన ట్వీట్ చేసింది రిచా చద్దా.
గాల్వాన్ లోయలో భారత సైనికులు చైనా సైనికులతో జరిగిన గొడవలో పెద్ద మొత్తంలో చనిపోయిన విషయం తెలిసిందే. అంటే రిచా చద్దా ఉద్దేశ్యం …… పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మీరు ఆక్రమించుకోవాలని చూస్తే చంపేయడం ఖాయమని తేల్చి చెప్పడమే కదా ! పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన ఈ భామ భారత కీర్తి పతాకాన్ని అవమానించేలా మాట్లాడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. దాంతో నా ఉద్దేశ్యం అది కాదని ,సదరు పోస్ట్ ను తొలగించింది. అయితే ఇలాంటి వాళ్ళను క్షమించొద్దని రిచా చద్దా పై బూతుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.