బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హత్యకు రెక్కీ నిర్వహించారు. ఏకంగా మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించామని అయితే సల్మాన్ ని ఏమి చేయలేకపోయామని విచారణలో వెల్లడించారట దుండగులు. పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలాని చంపిన గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ని హత్య చేయాలని చాలాకాలంగా ఎదురు చూస్తోంది.
కృష్ణ జింక లను బిష్ణోయ్ వంశస్తులు దైవంగా కొలుస్తారు. అయితే అప్పట్లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడి చంపాడు. దాంతో అప్పటి నుండి పగబట్టాడు లారెన్స్ బిష్ణోయ్. అందుకే పలుమార్లు రెక్కీ నిర్వహించారు. కానీ సల్మాన్ ఖాన్ తప్పించుకున్నాడు. సల్మాన్ ఖాన్ పై రెక్కీ నిర్వహించినట్లు తెలియడంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ కు భద్రత పెంచారు.