స్టార్ హీరోయిన్ సమంత వెబ్ సిరీస్ కు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కోసం సమంత రంగంలోకి దిగింది. గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత ఎట్టకేలకు షూటింగ్ కు సిద్ధమైంది. లొకేషన్ లో అడుగుపెట్టింది. సిటడెల్ అనే ఫ్రాంచైజీ కోసం నడుం బిగించింది సమంత. పూర్తి యాక్షగా ఇమేజ్ తో ఈ వెబ్ సిరీస్ సాగనుంది.
ఇక యాక్షన్ తో పాటుగా కావాల్సినంత రొమాన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా సమంత హీరోయిన్ గా నటిస్తోంది. గతకొంత కాలంగా మాయో సైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కు ఈ ఛాన్స్ గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.