
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రెండేళ్ల క్రిందట ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆ కేసులో ఇప్పుడు మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పేరు మారుమ్రోగుతోంది. అంతేకాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన ఎంపీ ఒకరు ఆదిత్య ఠాక్రే పై తీవ్ర ఆరోపణలు చేసాడు.
ఆదిత్య ఠాక్రే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి , హీరోయిన్ రియా చక్రవర్తి కి 44 సార్లు ఫోన్ చేసాడని సంచలన ఆరోపణలు చేసాడు. ఈ ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తనయుడే ఈ ఆదిత్య ఠాక్రే అనే విషయం తెలిసిందే. తండ్రి ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్ లో మంత్రిగా పనిచేసాడు ఆదిత్య ఠాక్రే.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ సూసైడ్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక సుశాంత్ మరణించిన కొన్నాళ్లకే సుశాంత్ మేనేజర్ కూడా మరణించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఆరోపణలన్నీ ఆదిత్య ఠాక్రే మీదకు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తున్నాడు ఆదిత్య ఠాక్రే. శివసేన పార్టీని నిలువునా చీల్చిన వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఏమి ఆరోపిస్తారు అంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు.