కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ జనవరి 25 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు పఠాన్ సినిమాపై పలు వివాదాలు దాడి చేశాయి. దాంతో బైకాట్ పఠాన్ అంటూ ప్రచారం జరిగింది కూడా. కట్ చేస్తే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ ఓపెనింగ్స్ సాధించింది పఠాన్.
మొదటి రోజున 340 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాలీవుడ్ లో సరికొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఎందుకంటే గతకొంత కాలంగా బాలీవుడ్ చిత్రాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి. అలాంటి సమయంలో వచ్చిన పఠాన్ మ్యాజిక్ చేసింది……. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. దాంతో 18 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఇండియన్ టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక దీపికా పదుకునే ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచింది. అందాలతో ఎంతగా కవ్వించిందో అంతకంటే ఎక్కువగా యాక్షన్ సీన్స్ తో అదరగొట్టింది. దీపికా పదుకునే యాక్షన్ ని చూసి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. అయితే బికినీలో దీపికా చూపించిన అందాలని కొంతమంది గుడ్లప్పగించి చూసేలా చేస్తే…… అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చి పడ్డాయి. దాంతో పెద్ద వివాదమే చెలరేగింది. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా ఈ భామ మాత్రం లెక్క చేయలేదు……. ఐ డోంట్ కేర్ అనే ధోరణి ప్రదర్శించింది. దంగల్ , బాహుబలి 2 , ఆర్ ఆర్ ఆర్ , KGF 2 చిత్రాల తర్వాత స్థానాన్ని ఆక్రమించింది పఠాన్ . దాంతో షారుఖ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.