17 C
India
Friday, February 3, 2023
More

  పఠాన్ రివ్యూ

  Date:

  shah rukh khan's pathaan review
  shah rukh khan’s pathaan review

  నటీనటులు : షారుఖ్ ఖాన్ , దీపికా పదుకోన్ , జాన్  అబ్రహం
  సంగీతం : సంచిత్ బల్హార – అంకిత్ బల్హార
  నిర్మాత : యష్ చోప్రా
  దర్శకత్వం : సిద్దార్థ్ ఆనంద్
  రేటింగ్ : 3/ 5
  రిలీజ్ డేట్ : 25 జనవరి 2023

  కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ” పఠాన్ ”. దీపికా పదుకోన్ , జాన్ అబ్రహం , డింపుల్ కపాడియా వంటి తదితర స్టార్స్ నటించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు పలు వివాదాలను ఎదుర్కొంది. ఎట్టకేలకు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. షారుఖ్ నాలుగేళ్ళ తర్వాత నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  కథ :

  దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్దపడే వ్యక్తి పఠాన్ ( షారుఖ్ ఖాన్ ) . సైన్యంలో చేరి ” రా ” లో సీక్రెట్ ఏజెంట్ గా పలు సాహసోపేతమైన మిషన్ లలో పాల్గొంటాడు. అయితే ఓ మిషన్ లో పాల్గొన్న సమయంలో తీవ్ర గాయాలపాలై రా కు దూరమౌతాడు. తనలాగే రా కు దూరమైన వాళ్లతో కలిసి ఓ మిషన్ స్టార్ట్ చేస్తాడు. పాకిస్థాన్ తో కలిసి భారత్ ను నాశనం చేయాలని చూసే దేశద్రోహుల ఆట కట్టిస్తాడు. ఇందుకోసం పఠాన్ ఎన్ని కష్టాలు పడ్డాడు ? ఎలాంటి సాహసాలు చేసాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  హైలెట్స్ :

  షారుఖ్ ఖాన్
  దీపికా పదుకోన్ గ్లామర్
  యాక్షన్ సీన్స్

  డ్రా బ్యాక్స్ :

  రొటీన్ స్టోరీ

  నటీనటుల ప్రతిభ :

  కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు నిజంగా ఇది కం బ్యాక్ సినిమా అని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఊర మాస్ సినిమానే అయినప్పటికీ సౌత్ సినిమాలో ఎలాగైతే హీరోకు ఎలివేషన్ సీన్స్ ఉంటాయో అలాంటి సన్నివేశాలను షారుఖ్ కు పెట్టి ప్రేక్షకులను అలరించాడు దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్. షారుఖ్ కుర్ర హీరోలతో పోటీ పడేలా యాక్షన్ సీన్స్ తో మెప్పించాడు. ఒక్కటేమిటి …… డైలాగ్ డెలివరీ …… యాక్షన్ , రొమాన్స్ ఇలా అన్ని విభాగాల్లో ఇరగదీసి షాక్ ఇచ్చాడు షారుఖ్ ఖాన్. ఇక దీపికా పదుకోన్ కూడా ఇరగదీసింది. యాక్షన్ సీన్స్ లో ఎంతగా రెచ్చిపోయిందో …… గ్లామర్ లో కూడా చంపేసిందిపో …… బికినీ ట్రీట్ ఇచ్చి కళ్ళు చెదిరేలా చేసింది. అందాలను ఆరబోయడమే కాదు ఫైటింగ్స్ తో కూడా మెప్పించింది. దీపికా పదుకోన్ గ్లామర్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి. జాన్ అబ్రహం స్టైలిష్ గా ఉన్నాడు …… యాక్షన్ తో  అదరగొట్టాడు . ఇక మిగతా పాత్రల్లో డింపుల్ కపాడియా , అశుతోష్ రానా తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు.

  సాంకేతిక వర్గం :

  ముందుగా దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ని మెచ్చుకోవాలి. షారుఖ్ లాంటి స్టార్ ను చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సమయంలో ఎలా చూపిస్తాడో అనే టెన్షన్ ఉంటుంది. అయితే సిద్దార్థ్ మాత్రం షారుఖ్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సినిమా ప్రేక్షకులను అలరించేలా షారుఖ్ ను ప్రెజెంట్ చేసి నూటికి నూరు మార్కులు కొట్టేసాడు. యష్ చోప్రా నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పేదేముంది. భారీగా ఖర్చు పెట్టి తన నిర్మాణ దక్షత నిరూపించుకున్నాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. పాటలు అలాగే నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.

  ఓవరాల్ గా :

  పఠాన్ అందరినీ మెప్పించే సినిమా.

  Share post:

  More like this
  Related

  థియేటర్ లో అన్ స్టాపబుల్ షో

  నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సూపర్ డూపర్ హిట్...

  తారకరత్న కోసం 44 రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగిస్తున్న బాలయ్య

  నందమూరి తారకరత్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దాంతో...

  సునామీకి సిద్దమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

  సోషల్ మీడియాలో సునామీ సృష్టించడానికి సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...

  100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 250 కోట్లకు పైగా వసూళ్లను...

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  ప్రభాస్ ప్రాజెక్ట్ – K పై ఆ ప్రచారాన్ని కొట్టిపడేసిన టీమ్

  డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం '' ప్రాజెక్ట్ - K...

  1000 కోట్ల దిశగా దూసుకుపోతున్న పఠాన్

  కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ 1000 కోట్ల...

  షారుఖ్ పఠాన్ కు భారీ వసూళ్ల వర్షం

  కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం '' పఠాన్...

  షారుఖ్ పఠాన్ ట్విట్టర్ రివ్యూ

  కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం పఠాన్. దీపికా...