
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. జనవరి 25 న భారీ ఎత్తున విడుదలైన పఠాన్ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు 600 కోట్ల వసూళ్లు వచ్చాయి దాంతో అవలీలగా 1000 కోట్లు వసూల్ చేయడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
దీపికా పదుకొన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అందాలను ఆరబోసి పిచ్చెక్కించడమే కాకుండా యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టి షాక్ ఇచ్చింది. అందాలతో ఎంతగా రెచ్చిపోయిందో ……… యాక్షన్ తో కూడా రెచ్చిపోయి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. దీపికా కాస్ట్యూమ్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ……. పెద్ద వివాదాన్ని సృష్టించింది. అయితే అదే సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.
షారుఖ్ ఖాన్ గత నాలుగేళ్లుగా సినిమాలు నటించడం మానేసాడు. వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న షారుఖ్ కొంత బ్రేక్ ఇచ్చాడు. కొన్నాళ్ల విరామం తర్వాత చేసిన ఈ పఠాన్ షారుఖ్ ఖాన్ కు మరిచిపోలేని కం బ్యాక్ అనే చెప్పాలి. పఠాన్ హిట్ అవుతుందేమో అనుకున్నారు కానీ ఇంతగా వసూళ్లు సాధిస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని అనుకోలేదు. దాంతో పఠాన్ చిత్ర బృందం చాలా చాలా సంతోషంగా ఉంది.