కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ” పఠాన్ ”. జనవరి 25 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి దాంతో 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 832 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి చరిత్ర సృస్టించింది. షారుఖ్ ఖాన్ పని అయిపోయింది అని కామెంట్ చేస్తున్న వాళ్లకు పఠాన్ గుణపాఠం చెప్పింది.
భారత్ లో 500 కోట్లకు పైగా వసూళ్లు రాగా మిగతా అన్ని దేశాల్లో కలిపి 300 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి దాంతో మొత్తంగా 832 కోట్ల వసూళ్లు పఠాన్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఇంకా పఠాన్ జోరు చూపిస్తోంది దాంతో ఈ సినిమా అవలీలగా 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇక దీపికా పదుకోన్ నటన ఈ సినిమాకు మరో హైలెట్ . ముఖ్యంగా దీపికా పదుకోన్ బికినీ సీన్ రచ్చ రచ్చ చేసింది. ఆ పాట కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీపికా గ్లామర్ తోనే కాకుండా యాక్షన్ తో కూడా అదరగొట్టింది. జాన్ అబ్రహం నెగెటివ్ రోల్ పోషించాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్ కు ఊపిరి పోసింది. గతకొంత కాలంగా బాలీవుడ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు….. అలాంటి సమయంలో వచ్చిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.