బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ సైకో అని మరోసారి సంచలన ఆరోపణలు చేసింది అతడి మాజీ ప్రేయసి సోమీ అలీ. పాకిస్థాన్ కు చెందిన సోమీ అలీ సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ కియా అనే చిత్రం చూసి అతడికి వీరాభిమాని అయ్యింది. పాకిస్థాన్ నుండి ఇండియాకు వచ్చి మోడల్ గా , నటిగా అవకాశాలు దక్కించుకుంది.
అదే సమయంలో సల్మాన్ ఖాన్ తో పరిచయం కాస్తా లివింగ్ రిలేషన్ కు దారి తీసింది. దాంతో పదేళ్ల పాటు సల్మాన్ – సోమీ అలీ ప్రేమలో ఉన్నారు. అయితే ఆ సమయంలో కొన్నిసార్లు సల్మాన్ సైకో లాగా ప్రవర్తిస్తాడట. ఇష్టమొచ్చినట్లు కొడతాడట. దాంతో అతడి మీద ప్రేమ ఉండటంతో కొన్నాళ్ళు భరించిందట. ఆ తర్వాత ఇక సహించలేకపోయింది. తనని అదేపనిగా కొడుతుండటంతో సల్మాన్ కు బ్రేకప్ చెప్పింది.
ఆ తర్వాత సినిమాలు మానేసి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. అడపా దడపా సల్మాన్ పై ఆరోపణలు చేస్తోంది. తాజాగా మరోసారి ఆరోపణలు చేసింది. సల్మాన్ ఖాన్ ని ఆరాధించడం మానేయండి. అతడు పెద్ద సైకో ,తరచుగా అమ్మాయిలను కొడుతూనే ఉంటాడని ఆరోపించింది. గతంలో ఓ పార్టీలో ఐశ్వర్యారాయ్ ని కూడా కొట్టాడు సల్మాన్ ఖాన్. అప్పట్లో ఈ వార్త సంచలనమే సృష్టించింది. దాంతో ఐశ్వర్యారాయ్ సల్మాన్ కు బ్రేకప్ చెప్పింది.
Breaking News