మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కు గుండెపోటు వచ్చింది. దాంతో సకాలంలో స్పందించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగింది. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో డాక్టర్లు బ్రతికించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది సుస్మితా సేన్. అయితే ఈ గుండెపోటు విషయాన్ని సుస్మితా సేన్ స్వయంగా వెల్లడించడం విశేషం.
నేను గుండెపోటుకు గురయ్యాను ….. అయితే స్టంట్ వేశారు కాబట్టి బాగున్నాను ……. కోలుకుంటున్నాను త్వరలోనే డిశ్చార్జ్ అవుతాను అంటూ పేర్కొంది సుస్మితా సేన్. 47 సంవత్సరాల సుస్మితా సేన్ 1994 లో విశ్వసుందరి కిరీటాన్ని గెల్చుకుంది. విశ్వసుందరిగా సంచలనం సృష్టించిన తర్వాత అటు బాలీవుడ్ లో ఇటు దక్షిణ భారత సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి.
హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో స్టార్ డం పొందలేకపోయింది. అయితే అడపా దడపా సినిమాలలో నటిస్తూనే ఉంది. అంతేకాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇక లవ్వాట కూడా జోరుగానే సాగిస్తోంది. అంతా బాగుందని అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యింది. అయితే అదృష్టం బాగుండటంతో కోలుకుంటోంది.